Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిక్కిం రాష్ట్ర బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఏఆర్ రెహ‌మాన్‌

  • ప్ర‌క‌టించిన సీఎం ప‌వ‌న్ కుమార్ చామ్లింగ్‌
  • టూరిజం అభివృద్ధికి రెహ‌మాన్ సంగీతం తోడు
  • అంత‌ర్జాతీయ గుర్తింపు తీసుకువ‌చ్చే ప్ర‌యత్నం
గ్రామీ, ఆస్కార్ అవార్డుల గ్ర‌హీత, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహ‌మాన్‌ను త‌మ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సిక్కిం ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కుమార్ చామ్లింగ్ తెలిపారు. గ్యాంగ్‌ట‌క్‌లో జ‌రిగిన సిక్కిం రెడ్ పాండా వింట‌ర్ కార్నివాల్ వేడుక‌లో భాగంగా ఆయ‌న ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇదే కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రెహ‌మాన్‌కి పుష్ప‌గుచ్ఛం ఇచ్చి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా రెహ‌మాన్ మాట్లాడుతూ... 'దేశంలో ఈశాన్య రాష్ట్రాలు ప్ర‌త్యేక‌మైన‌వి. వాటిలో సిక్కిం చాలా ప్ర‌త్యేకం. ఇక్క‌డి ప‌ర్వ‌తాల అందాలు, ప్ర‌జ‌ల అల‌వాట్లు అందరి దృష్టిని ఆక‌ర్షిస్తాయి. ఈ అందాల‌కు సంగీతం తోడైతే వ‌చ్చే అనుభూతి మాట‌ల్లో చెప్ప‌లేనిది' అన్నారు. సిక్కిం ప‌ర్యాట‌క రంగ అభివృద్ధి కోసం సంగీతం చేస్తాన‌ని, త‌ద్వారా అంత‌ర్జాతీయంగా సిక్కిం ప్ర‌త్యేక‌తకు గుర్తింపు వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు. త‌న‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంచుకున్నందుకు ముఖ్య‌మంత్రికి, సిక్కిం ప్ర‌జ‌ల‌కి రెహ‌మాన్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
ar rahman
sikkim
brand ambassador

More Telugu News